ఓటిటి లో సబ్ స్క్రైబర్స్ కి అందుబాటులోకి వచ్చిన అజయ్ దేవగన్ “భోళా”

Published on May 25, 2023 8:12 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ చివరిసారిగా యాక్షన్ థ్రిల్లర్ భోళా లో కనిపించాడు. ఈ చిత్రం తమిళం లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఖైతి చిత్రానికి అధికారిక రీమేక్. అజయ్ దేవగన్ స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. హిందీలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. కొన్ని రోజుల క్రితం, ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చింది కానీ 399 రూపాయల అద్దెతో.

ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్ భోళా తన సబ్‌స్క్రైబర్‌ల కోసం అద్దె లేకుండా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కాబట్టి ఈ చిత్రాన్ని థియేటర్‌లలో చూడలేకపోయిన వారు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. టబు పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రను పోషించగా, అమలా పాల్ అజయ్ దేవగన్ సరసన హీరోయిన్ గా నటించింది. దీపక్ డోబ్రియాల్, సంజయ్ మిశ్రా, గజరాజ్ రావు, వినీ కుమార్ ఈ సినిమా లో ఇతర కీలక పాత్రలు పోషించారు. అజయ్ దేవగన్ ఎఫ్ ఫిల్మ్స్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, టి సిరీస్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించాయి. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ స్వరాలు సమకూర్చారు.

సంబంధిత సమాచారం :