అజిత్, విజయ్ ల క్లాష్ ఈసారి తప్పదా?

అజిత్, విజయ్ ల క్లాష్ ఈసారి తప్పదా?

Published on Sep 25, 2022 8:30 PM IST

ఏ సినిమా ఇండస్ట్రీ అయినా కూడా పండుగ సీజన్లో డెఫినెట్ గా భారీ పోటీ తప్పదు. ఇక అలాంటిది బాక్సాఫీస్ దగ్గర ఇద్దరు ఒకేలాంటి స్టార్డం ఉన్న స్టార్స్ నుంచి ఒకేసమయంలో సినిమా పడితే ఆ ఊహ కూడా ఇంకో లెవెల్లో ఉంటుంది. ఈ ఏడాది మన దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుల సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ సినిమాలు అలాగే రావాల్సి ఉన్నవి కానీ తర్వాత వాయిదాలు పడ్డాయి.

అలాగే తమిళ్ నుంచి అయితే ఇద్దరు బిగ్ స్టార్స్ అయిన దళపతి విజయ్ మరియు అజిత్ లు సినిమాలు కూడా వస్తే ఈ రేంజ్ లోనే ఉంటుంది. మరి లాస్ట్ టైం బీస్ట్ సహా వలిమై కి ఇలా జరిగి ఉండొచ్చు అనుకున్నారు కానీ ఈసారి మాత్రం వారు చేస్తున్న వరిసు, తునివు చిత్రాలు డెఫినెట్ గా క్లాష్ అవ్వొచ్చని అంటున్నారు.

ముందు అయితే అజిత్ సినిమా జనవరి చివరికి వెళ్లొచ్చు అని అనుకున్నారు కానీ ఇప్పుడు అయితే ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలోనే ఉండొచ్చని గట్టి టాక్. మరి ఇదే కానీ నిజం అయితే తమిళ్ లో సంక్రాంతి మామూలుగా ఉండదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు