“వలిమై” టీజర్ కి సర్వం సిద్దం…త్వరలో విడుదల!

Published on Sep 16, 2021 5:02 pm IST

అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోథ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వలిమై. ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్ విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన విడుదల తేది పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం కి సంబంధించిన ఒక హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతుంది.

వలిమై చిత్రానికి సంబంధించిన టీజర్ త్వరలో విడుదల కానుంది. టీజర్ కట్ పై సినీ పండితులు ఇప్పటికే తమ అభిప్రాయాలను వెల్లడించారు. టీజర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉండే విధంగా కట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాక ఇప్పటి వరకు ఉన్న ఆల్ టైమ్ రికార్డు లను ఈ టీజర్ తో సెట్ చేసే విధంగా ఫ్యాన్స్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో టీజర్ విడుదల తో పాటుగా, చిత్రం కి సంబంధించిన విడుదల తేదీను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ మరియు బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హుమ ఖురేషీ, కార్తికేయ, యోగి బాబు తదితరులు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :