హాట్ టాపిక్ గా అజిత్ రికార్డు రెమ్యునరేషన్.!

Published on Mar 24, 2022 10:55 am IST


మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర బాక్సాఫీస్ ని ఓ రేంజ్ లో షేక్ చేసే స్టార్ హీరోస్ లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కూడా ఒకరు. రీసెంట్ గా తన నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ సినిమా అయినటువంటి “వలిమై” కూడా 200 కోట్ల వసూళ్లను అందుకొని తన కెరీర్ లో ఒక హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత అజిత్ చెయ్యబోయే మరో భారీ సినిమా కూడా అనౌన్స్ అయ్యిన సంగతి తెలిసిందే.

దీనిని దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించనుండగా ఇప్పుడు ఈ సినిమాకి గాను అజిత్ తీసుకుంటున్న రికార్డు స్థాయి రెమ్యునరేషన్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకి గాను అజిత్ ఏకంగా 102 కోట్లు తీసుకుంటున్నాడట. అంత మొత్తాన్ని కూడా లైకా ప్రొడక్షన్స్ వారు అజిత్ కి ఇవ్వడానికి రెడీ అయ్యారని ఈ టాక్ నిజమే అని కోలీవుడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. మొత్తానికి అయితే అజిత్ మాత్రం తన రెమ్యునరేషన్ తో ఇప్పుడు సెన్సేషన్ ని రేపారు.

సంబంధిత సమాచారం :