100 కోట్ల వసూళ్లతో దూసుకు పోతున్న అజిత్ “వలిమై”

100 కోట్ల వసూళ్లతో దూసుకు పోతున్న అజిత్ “వలిమై”

Published on Feb 27, 2022 10:00 PM IST

అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం వలిమై. బే వ్యూ ప్రాజెక్ట్స్ మరియు జీ స్టూడియోస్ పతాకంపై సంయుక్తం గా నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం తమిళ నాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

ఇప్పటి వరకు ఈ చిత్రం 100 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. అజిత్ కుమార్ పలు చోట్ల ఆల్ టైమ్ రికార్డు లను సెట్ చేస్తున్నారు. అంతేకాక కరోనా వైరస్ పరిస్థితుల తర్వాత ఈ తరహా హిట్ సాధించడం తో ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 24 వ తేదీన విడుదల అయిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఏ తరహా వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు