ఓ రేంజ్ లో ఉన్న అజిత్ కుమార్ “వలిమై” గ్లింప్స్

Published on Sep 23, 2021 7:07 pm IST


అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోథ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వలిమై. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, మరియు ఫస్ట్ సింగిల్ ఇప్పటికే ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిత్ర యూనిట్ తాజాగా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయడం జరిగింది. ఈ గ్లింప్స్ అమేజింగ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది.

గ్లింప్స్ అంతటినీ కూడా బైక్ రేసింగ్ మరియు ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ లను చూపించే ప్రయత్నం చేశారు. అజిత్ చెప్పే డైలాగ్ మరింత పవర్ ఫుల్ గా ఉంది. ఈ గ్లింప్స్ లో టాలీవుడ్ యంగ్ హీరో గుమ్మకొండ కార్తికేయ సైతం ఉన్నారు. డిఫెరెంట్ మెకోవర్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రం లో హుమ ఖురేషీ, బాణీ, సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగి బాబు, రాజ్ అయ్యప్ప, పుగజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్ మరియు బోనీ కపూర్ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. విడుదల కొద్ది సేపటికే ఈ గ్లింప్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతూ, యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :