పవర్ ఫుల్ గా అజిత్ “విడా ముయార్చి” సెకండ్ లుక్!

పవర్ ఫుల్ గా అజిత్ “విడా ముయార్చి” సెకండ్ లుక్!

Published on Jul 7, 2024 9:01 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తదుపరి చిత్రం విడా ముయార్చిలో కనిపించనున్నాడు. షూటింగ్ చాలా కాలం క్రితం ప్రారంభమైనప్పటికీ, టీమ్ పెద్దగా అప్డేట్‌లను వెల్లడించలేదు. ఇది అభిమానులను కొద్దిగా నిరాశపరిచింది. అజిత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విడా ముయార్చి టీమ్ నుండి అప్డేట్ ఇక్కడ ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అజిత్ యొక్క సెకండ్ లుక్ పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేసారు. అజిత్ కుమార్ ఈ స్టైలిష్ లుక్స్ లో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.

ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్స్ అంటూ ఒక పోస్టర్లకి క్యాప్షన్ ను ఇవ్వడం జరిగింది. ఈ పోస్టర్లు ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో త్రిష, అర్జున్, రెజీనా కసాండ్రా మరియు ఆరవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు