ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అజిత్ ‘తెగింపు”.!

Published on Feb 8, 2023 7:00 am IST

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ మెసేజ్ డ్రామా “తెగింపు” కోసం తెలిసిందే. తన లాస్ట్ హిట్ “వలిమై” దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా అజిత్ కెరీర్ లో మరో సూపర్ హిట్ గా అయితే నిలిచింది. మరి ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా అయితే ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ఈరోజు నుంచి అయితే పలు భాషల్లో అందుబాటులో ఉంది. మరి అప్పుడు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ సినిమాని ఇప్పుడు వీక్షించి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ సినిమాలో మంజు వారియర్ నటించగా జిబ్రాన్ సంగీతం అందించాడు అలాగే బోనీ కపూర్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :