భారీ మార్క్ కి చేరిన అజిత్ “తునివు” వసూళ్లు.!

Published on Jan 28, 2023 10:00 am IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “తునివు”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రం అజిత్ కెరీర్ లో మరో పెద్ద హిట్ గా నిలిచింది. తన లాస్ట్ సూపర్ హిట్ వలిమై కన్నా భారీ వసూళ్లు ఈ చిత్రం రాబడుతూ తమిళ సినిమా సహా ఓవర్సీస్ లో కూడా స్టాండర్డ్ గా ఉన్నట్టు తమిళ సినీ ట్రాకర్స్ చెప్తున్నారు.

ఇక లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం మరో భారీ మార్క్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. వరల్డ్ వైడ్ అయితే ఈ చిత్రం 225 కోట్ల మాసివ్ గ్రాస్ ని టచ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇది అజిత్ కెరీర్ లో మరో హైయెస్ట్ కాగా తన ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించగా మంజు వారియర్ ఫీమేల్ లీడ్ లో ఈ చిత్రంలో నటించింది. అలాగే బోనీ కపూర్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :