అజిత్ “తునివు” ప్రీ రిలీజ్ బిజినెస్ పై రచ్చ.!

అజిత్ “తునివు” ప్రీ రిలీజ్ బిజినెస్ పై రచ్చ.!

Published on Nov 12, 2022 1:01 PM IST

కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో ఒకరైనటువంటి స్టార్ హీరో అజిత్ కూడా ఒకరు. మరి అజిత్ హీరోగా తన లాస్ట్ భారీ హిట్ “వలిమై” దర్శకుడు హెచ్ వినోద్ తో తెరకెక్కిస్తున్న మరో భారీ యాక్షన్ చిత్రం “తునివు”. మరి ఈ చిత్రం అయితే ఆల్రెడీ మేకర్స్ పలు అప్డేట్స్ అందించగా నెక్స్ట్ అయితే రిలీజ్ సంక్రాంతి కి ఫిక్స్ కాగా ఇక ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ బయటకి రాగా ఇది సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారింది. ఇక ఇదిలా ఉండగా మరోపక్క ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కి సంబంధించి కూడా పలు రూమర్స్ గట్టిగా స్ప్రెడ్ అవుతున్నాయి.

అయితే ఈ చిత్రానికి ఏకంగా 280 కోట్ల బిజినెస్ జరిగినట్టుగా పలు రూమర్స్ వైరల్ అవుతుండగా అయితే దీనికి ఇంకా అంత రేంజ్ లో అయితే బిజినెస్ ఇంకా లాక్ అవ్వలేదని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇంకా థియేట్రికల్ బిజినెస్ కంప్లీట్ కావస్తుండగా మిగతా అన్నీ ఫైనల్ కావాల్సి ఉన్నాయని తమిళ్ ట్రాకర్స్ అంటున్నారు. దీనితో 280 కోట్ల బిజినెస్ అనేది జస్ట్ రూమర్ మాత్రమే అని తెలుస్తుంది. ఇక ఈ క్రేజీ యాక్షన్ ప్రాజెక్ట్ కి జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా మంజు వారియర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు