ఓటిటిలో కూడా అదరగొడుతున్న అజిత్ సినిమా.!

Published on Feb 11, 2023 1:02 am IST


కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా మంజు వారియర్ ఫీమేల్ లీడ్ లో నటించిన ఇంట్రెస్టింగ్ యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం “తునివు”. తెలుగులో తెగింపు గా వచ్చిన ఈ చిత్రం అజిత్ కెరీర్ లో మరో భారీ హిట్ గా అయితే నిలిచింది. మరి ఈ సినిమా రీసెంట్ గానే పలు భాషల్లో దిగ్గజ ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది.

మరి థియేటర్స్ లో అదరగొట్టిన ఈ సినిమా అందులో కూడా సాలిడ్ రెస్పాన్స్ ఆల్ ఓవర్ వరల్డ్ అందుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సినిమా వచ్చిన ఒక్క రోజులోనే దాదాపు 27 దేశాల్లో ఈ చిత్రం తమిళ్ హిందీ సహా తెలుగు భాషల్లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దీనితో తమిళ్ నుంచి అయితే అత్యంత వేగంగా ఇంతలా ట్రెండింగ్ లోకి వచ్చిన సినిమాగా తునివు నిలిచింది. ఇక ఈ సాలిడ్ ఎంటర్టైనర్ కి జిబ్రాన్ సంగీతం అందించగా బోనీ కపూర్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :