లేటెస్ట్..”వరిసు” కన్నా అజిత్ “తునివు” పై ముందే క్లారిటీ.?

లేటెస్ట్..”వరిసు” కన్నా అజిత్ “తునివు” పై ముందే క్లారిటీ.?

Published on Oct 28, 2022 11:49 AM IST

కోలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న సెన్సేషనల్ కాంబో ఏదన్నా ఉంది అంటే అది ఇళయ దళపతి విజయ్ మరియు స్టార్ హీరో అజిత్ ల కాంబో అని చెప్పాలి. అయితే విజయ్ నటిస్తున్న “వరిసు” చిత్రం ఆల్రెడీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరో పక్క అజిత్ నటించిన భారీ యాక్షన్ చిత్రం “తునివు” కూడా సంక్రాంతి బరిలోనే ఉంటుంది అని గట్టి టాక్ ఉంది.

అయితే దీనితో చాలా కాలం తర్వాత బిగ్గెస్ట్ క్లాష్ పడనున్నట్టు అందరిలో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. అయితే వీటిలో ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుంది అనేది ఆసక్తిగా మారగా మరి దీనిలో రిలీజ్ డేట్ పై ఇప్పుడు అజిత్ సినిమానే ముందు అప్డేట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ రిలీజ్ డేట్ పై క్లారిటీ అధికారికంగా ఈరోజే మేకర్స్ అనౌన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారా రిలీజ్ టైం ని అనౌన్స్ చేస్తారా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు