స్టార్ హీరో సినిమాకు ముహూర్తం కుదిరింది !

21st, December 2017 - 01:20:13 PM

దర్శకుడు శివ‌ వరుసగా నాలుగోసారి అజిత్ తో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ మూవీ జనవరి 19 న ప్రారంభం కానుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన వీరం, వేదాళం, వివేగం సినిమాలు మంచి విజయం సాధించాయి. అదే తరహాలో ఈ మూవీ ఉండబోతుందని సమాచారం. కోలివుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్ ఈ సినిమాను నిర్మించబోతోంది.

అనుష్క ఈ సినిమాలో నటించబోతుందనే వార్తలు వచ్చినా అధికారికంగా ప్రకటన లేదు. అజిత్ కెరీర్ లో ఇది 58వ సినిమా అవ్వడం విశేషం. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. వరుసగా నాలుగు సినిమాలు వి అక్షరంతో ప్రారంభం అవ్వడంతో సినిమా టైటిల్ విషయంలో అజిత్ సెంటిమెంటుని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.