పవర్‌ప్యాక్డ్‌గా అజిత్ ‘పట్టుదల’ ట్రైలర్

పవర్‌ప్యాక్డ్‌గా అజిత్ ‘పట్టుదల’ ట్రైలర్

Published on Jan 16, 2025 7:08 PM IST

తమిళ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటించిన రెండు సినిమాలు కూడా షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఇందులో గుడ్ బ్యాడ్ అగ్లీ, విదాముయార్చి చిత్రాలు ఇప్పటికే రిలీజ్ డేట్స్‌ను వాయిదా వేసుకున్నాయి. అయితే, ఈ చిత్రాల్లో ‘విదాముయార్చి’ మూవీపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అజిత్ సినిమా అంటే ఎలా ఉంటుందో మరోసారి ఈ ట్రైలర్ ప్రూవ్ చేసింది. ఇందులో పూర్తి యాక్షన్ సీక్వెన్స్‌లతో పవర్‌ప్యాక్డ్ కథతో అజిత్ మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఆయనతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఈ సినిమాలో సాలిడ్ రోల్ చేస్తున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

అందాల భామ త్రిష ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా రెజీనా మరో లీడ్ రోల్‌లో నటిస్తోంది. యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్ అందించే విధంగా ఈ మూవీని దర్శకుడు మగిళ్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ‘పట్టుదల’ చిత్రాన్ని ఫిబ్రవరి 6న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు