“తెగింపు” లో అజిత్ నుంచి చాలా రిస్కీ సీన్స్.!

“తెగింపు” లో అజిత్ నుంచి చాలా రిస్కీ సీన్స్.!

Published on Dec 23, 2022 11:00 PM IST


కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ చిత్రాల్లో దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన చిత్రం “తునివు” కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని తెలుగులో ఈ చిత్రం “తెగింపు” అనే పవర్ఫుల్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంపై అయితే తమిళ నాట భారీ అంచనాలు నెలకొనగా తెలుగులో కూడా ఈ చిత్రానికి డీసెంట్ బజ్ అయితే నెలకొంది. మరి ఈ సినిమాపై దర్శకుడు మాత్రం లేటెస్ట్ గా మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ రివీల్ చేస్తున్నాడు.

అజిత్ తన సినిమాల్లో ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ లు చేస్తాడో తెలిసిందే. గత వలిమై లో కూడా తన నుంచి క్రేజీ సీన్స్ ని వినోద్ తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో అయితే మరింత స్థాయిలో యాక్షన్ ఉంటుందట. పైగా చాలా సీన్స్ ని అజిత్ చాలా రిస్క్ తీసుకొని మరీ ఈ సినిమాకి చేసినట్టుగా తాను తెలిపాడు. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తుండగా ఈ జనవరిలో సంక్రాంతి రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు