అజిత్ ‘తెగింపు’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఎవరికంటే ?


కోలీవుడ్ స్టార్ నటుడు తలా అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తునీవు. మంజు వారియర్ కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీకి జీబ్రాన్ సంగీతం అందిస్తుండగా జీ స్టూడియోస్ వారితో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ గ్రాండ్ గా దీనిని నిర్మిస్తున్నారు.

మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన తునీవు మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై హైప్ మరింతగా పెంచేసాయి. ఇక తెలుగులో తెగింపు టైటిల్ తో రిలీజ్ అవుతున్న ఈ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ప్రముఖ సంస్థ రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ వారు దక్కించుకున్నారు. తెలుగులో కూడా అజిత్ కి మంచి క్రేజ్ ఉండడంతో తప్పకుండా తెగింపు మూవీ సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న రిలీజ్ తరువాత మంచి విజయం అందుకోవడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Exit mobile version