అజిత్ “వలిమై”కి అక్కడ అదిరిపోయే కలెక్షన్స్..!

Published on Feb 25, 2022 9:00 pm IST

తమిళ స్టార్‌ హీరో అజిత్ కుమార్ కథానాయకుడిగా, హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం “వలిమై”. జీ స్టూడియోస్ మరియు బోని కపూర్‌లు సంయుక్తంగా నిర్మించారు. మంచి అంచనాలతో నిన్న విడుదలైన ఈ చిత్రం హిట్‌టాక్‌ను తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్స్‌ పరంగా కూడా మంచి ఓపెనింగ్స్‌ని రాబట్టినట్టు తెలుస్తుంది.

అయితే తొలిరోజే కలెక్షన్స్‌ సునామి సృష్టించిన తొలి సినిమాగా ‘వలిమై’ నిలిచింది. తమిళనాడులో ఈ చిత్రం తొలిరోజు రూ.34 కోట్లు వసూలు చేసింది. తమిళనాడులోనే కలెక్షన్స్‌ ఈ రేంజ్‌లో ఉంటే తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో కలిపి 50 నుంచి 60 కోట్లు రూపాయలు దాటే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత సమాచారం :