సోషల్ మీడియా లో అజిత్ “వలిమై” పిక్స్ వైరల్!

Published on Oct 6, 2021 4:40 pm IST


అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోథ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వలిమై. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన గ్లింప్స్ మరియు ఫస్ట్ సింగిల్ సైతం సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి.

తాజాగా ఈ చిత్రం నుండి కొన్ని పిక్స్ విడుదల అయ్యాయి. వర్కింగ్ స్టిల్స్ మరియు సినిమాకి సంబందించిన కొన్ని పిక్చర్స్. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హుమ ఖురేషీ, కార్తికేయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం కి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. జీ స్టూడియోస్ మరియు బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి పతాకం పై ఈ చిత్రాన్ని బోని కపూర్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :