లేటెస్ట్: అజిత్ “వలిమై” చిత్రం విడుదల వాయిదా!

Published on Jan 6, 2022 6:56 pm IST


అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినొత్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం వలిమై. బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి మరియు జీ స్టూడియోస్ ల పై ఈ చిత్రాన్ని బోని కపూర్ నిర్మిస్తున్నారు. హుమ ఖురేషీ మరియు కార్తికేయ లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ను జనవరి 13 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది.

అయితే తాజాగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడం జరిగింది. త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్ల లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పలు పాన్ ఇండియా చిత్రాలు వాయిదా పడగా, వలిమై సైతం వాయిదా పడింది. ఈ చిత్రం తమిళం తో పాటుగా, తెలుగు మరియు హిందీ భాషల్లో తెరకెక్కింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :