భారీ ధర పలికిన అజిత్ ‘వివేగం’ తెలుగు హక్కులు !
Published on Jul 17, 2017 11:53 am IST


తమిళ స్టార్ హీరో అజిత్ చేస్తున్న ప్రస్తుత చిత్రం ‘వివేగం’ పై అక్కడి ప్రేక్షకుల్లో భారీ అంచనున్నాయి. విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్ అన్నీ బాగుండటంతో సినిమాపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. దీంతో సినిమా ఓపెనింగ్స్ పరంగా సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేయడం ఖాయమనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక తాజాగా ఈ చిత్రం యొక్క తెలుగు డబ్బింగ్ హక్కులు భారీ ధర పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.

సుమారు రూ.4.50 కోట్లకు ఈ హక్కులు అమ్ముడయ్యాయి. అజిత్ కేరీర్లో ఇప్పటి వరకు ఇదే బెస్ట్ డీల్ అని చెప్పోచ్చు. పెట్టిన ఈ మొత్తాన్ని చూస్తుంటే చిత్రం భారీ ఎత్తున రిలీజయ్యేలా కనిపిస్తోంది. తమిళంతో పాటే తెలుగు వెర్షన్ కూడా ఆగష్టు 10వ తేదీన రిలీజ్ కానుంది. టిజి. త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది.

 
Like us on Facebook