నా మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటె క్షమించమని వేడుకుంటున్నాను – అజయ్ ఘోష్
Published on Apr 20, 2017 3:00 pm IST


అందరికి నమస్కారం , నా పేరు అజయ్ ఘోష్ . నేను దాదాపుగా 10 సంవత్సరాలుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటుడుగా కొనసాగుతున్నాను . అందరికీ తలలో నాలుకలా ఉన్నానే తప్ప … ఇప్పటివరకు ఎవరినీ ఉద్దేశ పూర్వకంగా కించపరచడం చేయలేదు. కానీ ఈ మధ్య ‘తప్పు తండా’ ఆడియో ఫంక్షన్ లో నేను మాట్లాడిన కొన్ని మాటలు కొంత మందిని ఇబ్బంది పెట్టాయని తెలిసినది. కావున పత్రికా ముఖం గా వివరణ ఇవ్వదలుచుకున్నాను .

చాలా ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటూ నానా కష్టాలు పడుతూ ,అవమానాలు భరిస్తూ తెలుగు సినిమా లో సరైన అవకాశం కోసం ఎదురు చూసాను కానీ, మనవాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో వచ్చిన చిన్న చిన్న అవకాశాలు వినియోగించుకుంటూ వెళ్తున్న క్రమం లో… నా టాలెంట్ చూసి తమిళ దర్శకులు ఆస్కార్ కి ఎన్నికైన ‘విసారణై ‘ లాంటి గొప్ప సినిమా లో అవకాశం కల్పించారు. దీంతో మరెన్నో మంచి చిత్రాలలో నటించే అవకాశాలు లభించాయి. ప్రెసెంట్ తెలుగు లో కూడా మంచి చిత్రాలలో నటిస్తున్నాను.

ఇటీవల జరిగిన `తప్పు తండా` ఆడియో ఫంక్షన్ లో సరదాగా మాట్లాడాను తప్ప … ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశంతో మాత్రం కాదు. మహా నటులు ఎన్టీఆర్ గారు, నాగేశ్వర రావు గార్ల తో పాటు ఇంకా ఎంతో మంది మహా నటులకు వేదిక గా నిలిచింది చెన్నై నగరం. అలాంటి మహా నగరాన్ని సరదాగా పొగిడాను తప్ప .. ఏ దర్శకుణ్ణి కించపరచడానికి కాదనీ సవినయంగా మనవి చేసుకుంటూ.. ఒకవేళ నేను ఏమైనా తప్పుగా మాట్లాడివుంటే .. నా మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటె .. పెద్ద మనసుతో క్షమించమని వేడుకుంటున్నాను. మీ మంచి మనసుతో నేను మరెన్నో సినిమాలు చేయాలని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ … మీ అజయ్ ఘోష్

 
Like us on Facebook