రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న “రొమాంటిక్”..!

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న “రొమాంటిక్”..!

Published on Sep 25, 2021 5:28 PM IST

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, కేతికా శర్మ కలిసి నటిస్తున్న చిత్రం “రొమాంటిక్”. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరి శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకు నీల్ కశ్యప్ సంగీతం అందించగా, నరేష్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు