సెన్సార్ పూర్తి చేసుకున్న ఆకాశ్ పూరీ “రొమాంటిక్”..!

Published on Sep 4, 2021 6:00 pm IST

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, కేతికా శర్మ కలిసి నటిస్తున్న చిత్రం “రొమాంటిక్”. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. ఎలాంటి మార్పులు లేకుండా ఈ చిత్రం U/A సర్టిఫికేట్‌ను దక్కించుకుంది.

అయితే ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకు నీల్ కశ్యప్ సంగీతం అందించగా, నరేష్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభిస్తుంది.

సంబంధిత సమాచారం :