రొమాంటిక్ పోస్టర్స్ తో నింపేస్తున్నారు.. హిట్ అవుతుందా ?

రొమాంటిక్ పోస్టర్స్ తో నింపేస్తున్నారు.. హిట్ అవుతుందా ?

Published on Oct 24, 2021 6:49 PM IST

ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘రొమాంటిక్’ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29న భారీ స్థాయిలో థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. అయితే, చిత్రబృందం ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో చేస్తోంది. ఈ చిత్రం సాలిడ్ ప్రమోషన్స్ నడుమ సిటీ దగ్గర నుంచి ప్రతి చిన్నాచితకా టౌన్ లో కూడా రొమాంటిక్ పోస్టర్స్ తో నింపేస్తున్నారు. యూత్ ప్రతి ఒక్కడు చూడవల్సిన చిత్రం అని, డోంట్ మిస్ దిస్ అంటూ చిత్రబృందం సినిమాని బాగా ప్రమోట్ చేస్తోంది.

ఇక యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి డైరెక్షన్ లో ఈ చిత్రం రాబోతుంది. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి.

పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూరి తన కుమారుడు కోసం ఈ రొమాంటిక్ కి కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్ లను అందించాడు. ఇక ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించగా, నరేష్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు