డైరెక్ట్ ఓటిటి గా “ఆకాశవాణి” చిత్రం… రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?

Published on Sep 16, 2021 11:00 pm IST


తెలుగు సినిమా ఆకాశవాణి డ్రామా చిత్రం గా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పద్మనాభ రెడ్డి నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో సముద్ర ఖని, తేజ కాకమను, ప్రశాంత్, వినయ్ వర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల కి సిద్దం అవుతోంది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా సోని లివ్ లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. డైరెక్ట్ ఓటిటి గా సోనీ లీవ్ లో సెప్టెంబర్ 24 వ తేదీన ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :