లేటెస్ట్..”అఖండ” 100 రోజుల జాతరకు వేదిక, టైం ఫిక్స్..!

Published on Mar 11, 2022 2:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం “అఖండ”. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్య తో తీసిన హ్యాట్రిక్ సినిమా కావడం ఆ అంచనాలను అన్నిటినీ మించి భారీ హిట్ గా ఈ సినిమా నిలవడంతో గత ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మాంచి ప్రాఫిట్స్ అందించిన సినిమాగా ఇది నిలిచిపోయింది.

అంతే కాకుండా బాలయ్య కెరీర్ లోనే భారీ హిట్ గా ఈ సినిమా నిలిచి అదరగొట్టింది. అంతేనా ఈరోజుల్లో అసాధ్యంగా మారిన లాంగ్ రన్ ని కూడా ఈ చిత్రం అందుకొని ఆ రకంగా కూడా ‘అఖండ’మైన విజయాన్ని నమోదు చేసింది. మరి ఇప్పుడు ఈ సినిమా శత దినోత్సవానికి పరుగు తీస్తుండగా మేకర్స్ ఈ వేడుకను అత్యంత ఘనంగా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు గత కొన్ని రోజులు కితమే అనౌన్స్ చేశారు.

మరి ఇప్పుడు అయితే వేదిక మరియు ఈ వేడుక స్టార్ట్ అయ్యే సమయాన్ని వెల్లడి చేసారు. కర్నూల్ లోని ఎస్ టి బి సి గ్రౌండ్స్ లో రేపు మార్చ్ 12 సాయంత్రం 5 గంటల నుంచి మొదలు కానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ వేడుకలు ఏ రేంజ్ లో ఉంటాయో ఎవరెవరు హాజరవుతారో చూడాలి.

సంబంధిత సమాచారం :