లేటెస్ట్..”అఖండ” 100 రోజుల సెన్సేషనల్ వసూళ్ల వివరాలు.!

Published on Mar 12, 2022 7:40 pm IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గ్లామరస్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “అఖండ”. పేరుకి తగ్గట్టుగానే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ‘అఖండ’మైన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా దర్శకుడు బోయపాటి శ్రీను మరియు బాలయ్య ల నుంచి ఓ హ్యాట్రిక్ సినిమా అన్నపుడు ఆ హైప్ కి మించే ఈ సినిమా భారీ హిట్ గా నిలిచి వారి కెరీర్ లోనే చెరగని విజయాన్ని నమోదు చేసింది.

అయితే ఈ సినిమా ఇపుడు 100 రోజులు వేడుకకు రాగా 20 సెంటర్స్ లో శత దినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం 100 రోజులకి సంబంధించి వసూళ్ల వివరాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఈ సినిమాకి గాను టోటల్ 100 రోజుల్లో 225 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. థియేట్రికల్ గా 95.55 కోట్ల గ్రాస్ ని మరియు 160 కోట్ల గ్రాస్ రాగా మిగతా హక్కులకు కలిపి మొత్తంగా 225 కోట్ల వసూళ్ళని అఖండ అందుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. మరి ఈ వసూళ్ళని ఏరియాల వారీగా చూసినట్టు అయితే..

నైజాం – 26 కోట్లు
సీడెడ్ – 19 కోట్లు
వైజాగ్(ఉత్తరాంధ్ర) – 7.50 కోట్లు
తూర్పు గోదావరి – 4.75 కోట్లు
పశ్చిమ గోదావరి – 4.30 కోట్లు
గుంటూరు – 70 లక్షలు
కృష్ణ – 40 లక్షలు
నెల్లూరు – 30 లక్షలు
కర్ణాటక – 80 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 20 లక్షలు
ఓవర్సీస్ – 10 కోట్లు

ఇలా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 95.55 కోట్ల షేర్ ని 160 కోట్ల గ్రాస్ ని అఖండ అందుకొని అదరగొట్టింది. మరి ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :