ప్రస్తుతం భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ టాలీవుడ్ చిత్రమే అఖండ 2 తాండవం. నట సింహం బాలకృష్ణ హీరోగా తన బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గర్జించేందుకు రాబోతుంది. పలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమా ఆల్రెడీ మాసివ్ ఓపెనింగ్స్ పై కన్నేసింది.
డే 1 అంచనా వసూళ్లు?
అఖండ 2 ఎప్పుడొచ్చినా అదిరే వసూళ్లు ఉంటాయి అనే మాట ఎప్పుడు నుంచో ఉంది. ఇక అందుకు తగ్గట్టుగానే బాలయ్య గత సినిమాలు అన్నిటికి మించి ఈ సినిమాకి హైప్ కనిపిస్తుంది. సో వాటిని మించే దీనికి కూడా మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. గత సినిమా డాకు మహారాజ్ మొదటి రోజు 56 కోట్లకి పైగా అందుకుంది. అయితే అఖండ 2 మాత్రం ఈజీగా 60 కోట్లకి పైగా రాబట్టే ఛాన్స్ ఉన్నట్టు ప్రస్తుత అంచనా.. సో అఖండ 2 కి మాత్రం 60 నుంచి 70 కోట్ల మధ్య ఓపెనింగ్స్ గ్రాస్ పడే అవకాశం ఉంది.
క్రమంగా పెరుగుతున్న బాలయ్య ఓపెనింగ్స్ హవా
ఇదే అఖండ ప్రీక్వెల్ నుంచే బాలయ్య 2.0 మొదలైంది. అక్కడ నుంచి ప్రతీ సినిమా కూడా ఒకదాన్ని మించి ఇంకొకటి వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. అలానే డే 1 ఓపెనింగ్స్ కూడా ఒక సినిమాని మించి ఒకటి అందుకున్నాయి. ఇక ఇప్పుడు అఖండ 2 తాండవం మాత్రం మంచి మార్జిన్ తో గత సినిమాలు దాటే ఛాన్స్ తో కనిపిస్తుంది.
