టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ కాంబినేషన్స్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కూడా ఒకటి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్స్‌గా నిలిచాయి. ఇక వీరి కాంబోలో వచ్చిన ‘అఖండ’ ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబోలో తెరకెక్కుతున్న ‘అఖండ-2 తాండవం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ‘అఖండ 2’ చిత్ర షూటింగ్ మొదలయ్యిందని.. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మహాకుంభ మేళాలో ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాలో యాక్షన్ మొదలైందని ఓ సరికొత్త పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి పవర్‌ఫుల్ అఘోరి పాత్రలో దుమ్ములేపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.