ఓటీటీలోకి వచ్చేసిన ‘అఖండ 2’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

Akhanda 2

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2 : తాండవం’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో వచ్చిన ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయడంతో అదిరిపోయే హైప్ క్రియేట్ అయింది. ఇక కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్‌కు కాకుండా కాస్త ఆలస్యంగా థియేటర్లలో రిలీజ్ అయింది.

అయితే, ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ రన్ కొనసాగించింది. బాలయ్య నట విశ్వరూపాన్ని అభిమానులు మాత్రం ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా నేటి(జనవరి 9) నుంచి అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

సంయుక్త, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version