పద్మభూషణ్ బాలకృష్ణ.. ‘అఖండ 2’ టీమ్ సెలబ్రేషన్స్

పద్మభూషణ్ బాలకృష్ణ.. ‘అఖండ 2’ టీమ్ సెలబ్రేషన్స్

Published on Jan 27, 2025 10:00 PM IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డుల్లో నందమూరి నటసింహం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు. దీంతో నందమూరి అభిమానులు సంతోషంగా వేడుక చేసుకున్నారు. తమ అభిమాన నటుడికి దక్కిన గౌరవానికి వారు పండగ చేసుకున్నారు. ఇక టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు మొదలుకొని, రాజకీయ నేతల వరకు అందరూ బాలయ్యకు విషెస్ తెలిపారు.

అయితే, బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ 2’ టీమ్ ఆయనకు పద్మభూషణ్ అవార్డు రావడం తో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ‘అఖండ 2’ సెట్స్‌లో నందమూరి బాలకృష్ణకు టీమ్ సభ్యులు పుష్పగుచ్ఛాన్ని అందించారు. అటుపై బాలయ్యతో కేక్ కట్ చేయించారు. 14 రీల్స్ ప్లస్ నిర్మాతలతో సహా దర్శకుడు బోయపాటి శ్రీను, ఇతర చిత్ర యూనిట్ సభ్యులు ఈ సందర్భంగా బాలయ్యను అభినందించారు.

దీనికి సంబంధించిన వీడియోను వారు తాజాగా రిలీజ్ చేశారు. ఇలా తమ మూవీ హీరో కు దక్కిన గౌరవాన్ని టీమ్ సభ్యులు సెలబ్రేట్ చేసుకోవడం తో ఫ్యాన్స్ సంబర పడుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు