మహాశివరాత్రి ఎఫెక్ట్ : ఓటీటీలో ట్రెండింగ్ అవుతున్న ‘అఖండ 2’

అఖండ 2

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2’(Akhanda 2) థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా అందులో మాత్రం సంచలనం సృష్టిస్తోంది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ, డిజిటల్ వేదికపై ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 9 నుండి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఇండియా వైడ్ టాప్-10 ట్రెండింగ్‌లో 9వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఇందులో ఉన్న శివతత్వం మరియు ఆధ్యాత్మిక అంశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ చిత్రానికి వ్యూవర్‌షిప్ భారీగా పెరగడం విశేషం. విడుదలైన నెల రోజులు దాటినప్పటికీ, నెట్‌ఫ్లిక్స్‌లో ఇంకా ట్రెండింగ్‌లో కొనసాగుతూ బాలయ్య తన ఓటీటీ పవర్‌ను నిరూపిస్తున్నారు.

Exit mobile version