నైజాం, సీడెడ్ లో “అఖండ” 8 రోజుల రోరింగ్ కలెక్షన్ డీటెయిల్స్.!

Published on Dec 10, 2021 5:00 pm IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరక్కెక్కించిన రోరింగ్ బ్లాక్ బస్టర్ చిత్రం “అఖండ”. భారీ అంచనాలతో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఈ ఏడాది ఇంకో క్లీన్ బ్లాక్ బస్టర్ గా అన్ని చోట్లా సాలిడ్ వసూళ్లతో విజయ ఢంకా మోగించింది.

మరి ఈ సినిమా నైజాం మరియు మాస్ సినిమాలకి ఆయువు పట్టు అయినటువంటి సీడెడ్ ప్రాంత్రాల్లో మాత్రం అదిరే వసూళ్ళని అందుకొని నిలకడగా కొనసాగుతుంది అని చెప్పాలి. లేటెస్ట్ గా ఇప్పుడు 8వ రోజు వసూళ్ల వివరాలు తెలిసాయి. ఈ 8వ రోజు అఖండ నైజాం లో 41 లక్షల షేర్ రాబట్టగా సీడెడ్ లో 25 లక్షలు రాబట్టింది.

దీనితో ఈ 8 రోజులకి గాను నైజాం లో అఖండ మొత్తం 15.25 కోట్ల షేర్ ని రాబట్టగా సీడెడ్ లో ఇప్పుడు వరకు 10.20 కోట్ల షేర్ ని రాబట్టి దమ్ము చూపించింది. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే శ్రీకాంత్, పూర్ణ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

సంబంధిత సమాచారం :