“థలపతి విజయ్” 66వ చిత్రం కోసం అఖండ నటుడు!

Published on May 10, 2022 7:34 pm IST


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం తలపతి 66 లో నటిస్తున్నారు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సరసన ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. ఇటీవల, ప్రముఖ నటులు శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్ మరియు జయసుధ లు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించడానికి సిద్ధంగా ఉన్నారని మేకర్స్ ప్రకటించారు.

ఈరోజు, ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ మేక కూడా భాగమని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న ఈ బహుభాషా చిత్రంకి థమన్ సంగీతం అందిస్తున్నారు. అఖండ నటుడు ఈ చిత్రం కోసం కన్ఫర్మ్ అవ్వడం తో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :