ఓటీటీ రికార్డులను కూడా తిరగరాసిన “అఖండ”..!

Published on Jan 22, 2022 9:51 pm IST


నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. గత ఏడాది డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకుని అన్ని చోట్ల భారీగానే కలెక్షన్లను రాబట్టుకుంది. ఇటీవల 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిన్నటి నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చేసింది.

అయితే థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కూడా అఖండ బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. మునుపటి ఓటీటీ రికార్డులను బద్దలుకొడుతూ 24 గంటల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అత్యధిక వీక్షణలు పొందిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. థియేటర్లలో 50 రోజుల రన్ తర్వాత కూడా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించడం ఒక్క “అఖండ”కే చెల్లిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :