ఓటిటిలో “అఖండ” బ్లాస్ట్..సౌత్ లోనే టాప్ సినిమాగా.!

ఓటిటిలో “అఖండ” బ్లాస్ట్..సౌత్ లోనే టాప్ సినిమాగా.!

Published on Apr 9, 2022 1:07 PM IST


నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ లాస్ట్ చిత్రం “అఖండ”. బాలయ్య మరియు దర్శకుడు బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ హ్యాట్రిక్ మాస్ చిత్రం అన్ని అంచనాలు అందుకొని భారీ విజయాన్ని నమోదు చేసింది. మరి థియేటర్స్ లో బ్లాస్టింగ్ హిట్ ని నమోదు చేసిన ఈ సినిమా తర్వాత ప్రముఖ ఓటిటి యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చి సెన్సేషనల్ హిట్ గా నిలిచి అక్కడా రికార్డు స్థాయి రెస్పాన్స్ అందుకొంది.

మరి లేటెస్ట్ గా అయితే ఓటిటిలో అఖండ సెన్సేషన్ ఎలా ఉందో నేషనల్ లెవెల్ లో తెలిసింది. గత ఏడాది నుంచి వచ్చిన పలు భాషల సినిమాలు అందులోని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయ్యినవి థియేట్రికల్ గా వచ్చినవి కూడా కలిపిన జాబితాలో అఖండ చిత్రం దక్షిణాదిలో టాప్ పెర్ఫామర్ గా నిలిచి రికార్డు సెట్ చేసింది. మొత్తానికి అయితే ఓటిటి లో కూడా అఖండ జాతర ఓ రేంజ్ లో నమోదు అయ్యిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు