“అఖండ” రోర్..ఏరియాల వారీగా తెలుగు స్టేట్స్ వసూళ్ల వివరాలు.!

Published on Dec 3, 2021 7:00 pm IST

నందమూరి నటసింహం రోరింగ్ హిట్ చిత్రం “అఖండ”. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని కాకుండా అలాగే హ్యాట్రిక్ సినిమాగా కూడా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పుకుని నిన్న రిలీజ్ అయ్యింది. మరి ఈ అంచనాలకు తగ్గట్టుగానే అన్ని ఏరియాల్లో భారీ ఓపెనింగ్స్ బాలయ్య కెరీర్ లోనే అధికంగా రాబట్టింది. మరి ఆల్రెడీ నైజాం మరియు సీడెడ్ లో 4.37 కోట్లు, 3.45 కోట్లతో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకోగా ఇక మిగతా ఏరియాల్లో వసూళ్లు వివరాలు ఇలా ఉన్నాయి.

వైజాగ్ – 1.3 కోట్లు
నెల్లూరు – 0.91 కోట్లు
తూర్పు గోదావరి. – 1.2 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.97 కోట్లు
కృష్ణా – 0.87 కోట్లు
గుంటూరు – 1.20 కోట్లు ఈ చిత్రం రాబట్టింది.

ముందు నైజాం మరియు సీడెడ్ వసూళ్లు కలిపితే తెలుగు రాష్ట్రాల నుంచి 14.2 షేర్ రాబట్టింది. మొత్తానికి మాత్రం బాలయ్య ఒక సాలిడ్ ఓపెనింగ్ ని అందుకున్నాడు. అలాగే మౌత్ టాక్ కూడా బాగుంది కాబట్టి వీకెండ్ కి ఈ ఫిగర్స్ మరింత బలపడే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :