“అఖండ” డే 2 నైజాం, సీడెడ్ సాలిడ్ వసూళ్లు ఇవే.!

Published on Dec 4, 2021 6:00 pm IST

ఈ ఏడాది విడుదల కాబడిన చిత్రాల్లో మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యిన బిగ్ మూవీస్ లో ఒకటి “అఖండ”. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని అంచనాలను మ్యాచ్ చేస్తూ అన్ని చోట్లా కూడా సాలిడ్ రెస్పాన్స్ ని ఈ చిత్రం అందుకుంది.

ముఖ్యంగా అయితే నైజాం మరియు సీడెడ్ ఏరియా ల్లో అదిరే వసూళ్లను ఈ చిత్రం అందుకుంది. ఇక రెండో రోజు ఈ చిత్రం వసూళ్ల విషయానికి వస్తే నైజాం లో ఈ చిత్రం రెండో రోజు 2.2 కోట్లు షేర్ రాబట్టగా సీడెడ్ లో మాత్రం 1.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

మొదటి రోజుకి రెండో రోజుకి కూడా అఖండ సాలిడ్ వసూళ్లను అందుకుందనే చెప్పాలి. మరి ఫైనల్ గా కూడా మంచిఫిగర్స్ దగ్గరే ఈ సినిమా ఆగొచ్చు. మరి ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :