తెలుగు రాష్ట్రాల్లో “అఖండ” డే 2 వసూళ్ల వివరాలు ఇవే.!

Published on Dec 4, 2021 9:09 pm IST


కరోనా రెండో వేవ్ తర్వాత టాలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యిన మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన “అఖండ” కూడా ఒకటి. టాలీవుడ్ బాక్సాఫీస్ కి కొత్త ఊపు తెచ్చిన ఈ చిత్రం అనుకున్న ఈ చిత్రం ఈ నెల నుంచి రానున్న మిగతా సినిమాలు నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. మరి బోయపాటి మరియు బాలయ్య కాంబోలో వచ్చిన ఈ హ్యాట్రిక్ సినిమా అంచనాలకు తగ్గట్టుగా డే 1 ఓపెనింగ్స్ అందుకోగా మంచి టాక్ కూడా రావడంతో రెండో రోజు కూడా మంచి నిలకడని కనబరిచింది. మరి ఏరియాల వారీగా ఈ చిత్రం రెండో రోజు వసూళ్లు చూసినట్టు అయితే..

నైజాం – 2.25 కోట్లు
సీడెడ్ – 1.5 కోట్లు
వైజాగ్ – 70 లక్షలు
తూర్పు – 50 లక్షలు
వెస్ట్ – 34 లక్షలు
కృష్ణ – 45 లక్షలు
గుంటూరు – 42 లక్షలు
నెల్లూరు – 26 లక్షలు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది.

ఇక ఈ వారాంతం శని మరియు ఆదివారాలు కూడా అఖండ సాలిడ్ ఫిగర్స్ అందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి ఈ రెండు రోజులు బాలయ్య అఖండ ఎలాంటి ఫిగర్స్ ని నమోదు చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :