తెలుగు స్టేట్స్ లో “అఖండ” మూడో రోజు వసూళ్లు ఇవే.!

Published on Dec 5, 2021 7:06 pm IST


నందమూరి నటసింహం నందమయూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అఖండ” రిలీజ్ అయ్యి తన కెరీర్ లోనే భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ చిత్ర శాలి వసూళ్లతో స్టడీగా దూసుకెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వసూళ్లు వివరాలు తెలుస్తున్నాయి. మరి ఏరియాల వారీగా ఈ చిత్రం వసూళ్లు చూసినట్టు అయితే..

నైజాం – రూ 2.45 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 80 లక్షలు
తూర్పు గోదావరి – రూ. 55 లక్షలు
పశ్చిమ గోదావరి – రూ. 31 లక్షలు
కృష్ణ – రూ 41 లక్షలు
గుంటూరు – రూ. 41 లక్షలు
నెల్లూరు – రూ. 25 లక్షలు
సీడెడ్ – రూ 1.50 కోట్లు షేర్ ఈ చిత్రం వసూలు చేసింది.

మొత్తంగా అయితే మూడో రోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.68 కోట్లు రాబట్టింది. ఇది నిజంగా ఒక సాలిడ్ నెంబర్ అని చెప్పాలి. ఇక అలాగే ఈ ఆదివారం కూడా స్ట్రాంగ్ వసూళ్లు వచ్చే అవకాశం చాలా ఉంది. మొత్తానికి మాత్రం బాలయ్య మాస్ కం బ్యాక్ వేరే లెవెల్లో వచ్చింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :