ఆరో రోజు “అఖండ” తెలుగు రాష్ట్రాల వసూళ్ల వివరాలు.!

Published on Dec 8, 2021 4:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం “అఖండ”. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ హ్యాట్రిక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు నుంచే భారీ వసూళ్లను అందుకొని అదరగొడుతూ సాగుతుంది. ఇక ప్రతి ఏరియా లో కూడా చాలా స్ట్రాంగ్ గా నిలబడిన ఈ చిత్రం ఆరవ రోజు వసూళ్ల వివరాలు చూసినట్టు అయితే..

నైజాం: 92 లక్షలు
సీడెడ్: 65 లక్షలు
ఉత్తరాంధ్ర : 21 లక్షలు
తూర్పు గోదావరి : 20 లక్షలు
పశ్చిమ గోదావరి : 14 లక్షలు
గుంటూరు: 15 లక్షలు
కృష్ణ: 14 లక్షలు
నెల్లూరు: 11 లక్షలు

మొత్తం – 2.52 కోట్ల షేర్ ని ఈ చిత్రం ఆరవ రోజు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టి సాలిడ్ రన్ ని కంటిన్యూ చేస్తుంది. ఇక ఫుల్ రన్ లో పెద్ద ఎత్తునే లాభాలు ఈ చిత్రం గ్యారెంటీ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ విలన్ గా నటించారు. అలాగే థమన్ సంగీతం అందించగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :