నైజాంలో “అఖండ” హవా..7 రోజులు టోటల్ వసూళ్లు.!

Published on Dec 9, 2021 1:00 pm IST

ఇప్పుడు నందమూరి వారి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అఖండ” హవా కొనసాగుతుంది అని చెప్పాలి. బాలయ్య మరియు బోయపాటి శ్రీను కాంబో లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. హ్యాట్రిక్ సినిమాగా భారీ అంచనాలుతో ఈ చిత్రం రిలీజ్ అయ్యి అంతే స్థాయి విజయాన్ని అందుకుంది.

అయితే ఈ చిత్రం అన్ని కీలక ఏరియాల్లో స్ట్రాంగ్ వసూళ్లు రాబడుతుండగా ఇపుడు నైజాం ఏరియాలో 7వ రోజు వసూళ్లు బయటకి వచ్చాయి. మరో ఏడవ రోజు అఖండ చిత్రం 52 లక్షలు నైజాం లో రాబట్టింది. దీనితో మొత్తం 7 రోజులకి గాను 14.8 కోట్లు షేర్ ని అఖండ అక్కడ రాబట్టి రోరింగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇక అలాగే మిగతా ఏరియా లకు సంబంధించి వసూళ్ల వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు.. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :