రెండోసారి డీసెంట్ టీఆర్పీ అందుకున్న “అఖండ”.!

Published on Jun 17, 2022 7:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లాస్ట్ చిత్రం అయినటువంటి “అఖండ” తన కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచినా సంగతి తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీనుతో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం గత ఏడాది రిలీజ్ అయ్యి ఆ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

దీనితో ఈ చిత్రం విజయం టాలీవుడ్ లో చిరస్థాయిగా నిలిచింది. ఓ పక్క థియేటర్స్ ఇంకో పక్క ఓటిటి లో కూడా అదరగొట్టిన ఈ చిత్రం టెలివిజన్ స్క్రీన్ పై కూడా డీసెంట్ రెస్పాన్స్ ని అందుకుంది. అయితే రీసెంట్ గా స్టార్ మా లో రెండోసారి టెలికాస్ట్ కి ఈ చిత్రం రాగా రెండోసారి కూడా డీసెంట్ టీఆర్పీ రేటింగ్ ని అఖండ అందుకున్నట్టు తెలుస్తుంది.

మరి ఈ చిత్రానికి రెండోసారి 7.31 రేటింగ్ వచ్చినట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :