అఖండ లేటెస్ట్ నైజాం కలెక్షన్స్ !

Published on Dec 6, 2021 12:00 pm IST

తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు. ఇక అభిమాన హీరో సినిమాని అయితే, ఇంకా గొప్పగా ఆదరిస్తారు. ప్రస్తుతం బాలయ్య బాబు అఖండ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఈ కరోనా కాలంలో కొత్త సినిమాలకు జనం థియేటర్స్ కి వస్తారా అని అనుమాం ఉండేది. కానీ, అఖండ సినిమా కోసం థియేటర్ల దగ్గర ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

దాంతో అఖండ వసూళ్లు… రికార్డులు అంటూ ప్రస్తుతం అభిమానుల్లోనూ, చిత్రపరిశ్రమలోనూ హడావుడి కనిపిస్తుంది. నైజంలోనూ అఖండ ఘనమైన వసూళ్లను సాధిస్తోంది. నైజాంలో అఖండకు 4th డే షేర్ 2.95 కోట్లు వచ్చాయి.

ఇక మొత్తం నాలుగు రోజులకు గానూ నైజాం అఖండ షేర్ 12.08 కోట్లు. ఈ ఏడాదిలో కేవలం నాలుగు రోజుల్లో ఈ రేంజ్ లో షేర్ రాబట్టింది ఈ ఒక్క సినిమానే. ఏది ఏమైనా బాలయ్య బాక్సాఫీస్ ను షేక్ చేశాడు.

సంబంధిత సమాచారం :