దుర్గమ్మ దర్శనం తర్వాత “అఖండ” మేకర్స్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్!

Published on Dec 15, 2021 11:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన భారీ చిత్రం “అఖండ” బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో చూసాము. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా అఖండ దుమ్ము లేపి ఈ ఏడాది భారీ హిట్ గా నిలిచింది.

మరి ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడంతో సినిమా మేకర్స్ దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో బాలకృష్ణ అలాగే నిర్మాత మిర్యాల రవీంద్ర రెడ్డి నేడు బెజవాడ కనక దుర్గమ్మ దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకున్నారు. మరి ఈ తర్వాత వీరు చేసిన స్టేట్మెంట్స్ బయటకి వచ్చాయి.

మాట్లాడుతూ సినిమాని ఇంతలా ఆదరించిన ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలుపుతున్నాని అందుకే అమ్మవారి దర్శనం కోసం వచ్చామని. గతంలో టికెట్ ధరల కోసం మాట్లాడమని కానీ ఏదైతే అది అయ్యిందని రిలీజ్ చేసాం, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం అపీల్ కి వెళ్తాము అంటున్నారు చూద్దాం ఏమవుతుందో అని బాలయ్య కీలక కామెంట్స్ చేసారు.

అలాగే ఇంత విజయాన్ని అందుకోవడం సంతోషం అని తెలిపారు. అలాగే బోయపాటి మాట్లాడుతూ సినిమాని గెలిపించిన ప్రతి ఒక్కరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. అలాగే నిర్మాత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అఖండ సినిమాను థియేటర్ లో మాత్రమే చూడాల్సినది. అందుకే డేర్ చేసి మరీ రిలీజ్ చేసాం అని తెలిపారు.

సంబంధిత సమాచారం :