క్లైమాక్స్ కోసం బాలయ్యతో శ్రీకాంత్ !

Published on Oct 3, 2021 8:04 pm IST

నటసింహం బాలయ్య – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న ‘అఖండ’ సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రేపటి నుంచి శ్రీకాంత్ అఖండ క్లైమాక్స్ షూట్ లో పాల్గొనబోతున్నాడు. అయితే పక్కా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో శ్రీకాంత్ లుక్, అండ్ ఆయన పాత్ర వేషధారణ పూర్తి డిఫరెంట్ గా ఉండబోతున్నాయట.

లెజెండ్ లో జగపతి బాబును కొత్తగా చూపించిన బోయపాటి, ఈ సారి శ్రీకాంత్ ను కొత్తగా చూపించనున్నారు. ఇక బాలయ్య – శ్రీకాంత్ మధ్య వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ హైలైట్‌ గా ఉంటాయట. పైగా బోయపాటి అంటేనే యాక్షన్. అన్నిటికీ మించి గతంలో బాలయ్యతో చేసిన సింహా, లెజెండ్ సినిమాలు బారీ విజయాలు సాధించాయి. మరి ఇప్పుడు చేస్తోన్న సినిమా కూడా హ్యాట్రిక్ అవుతుందేమో చూడాలి.

ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా పై బాలయ్య ఫ్యాన్స్ బాగా హోప్స్ పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం :