“అఖండ” ఓవర్సీస్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్..!

Published on Dec 10, 2021 11:00 pm IST


నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకుని అన్ని చోట్ల కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా గట్టిగానే రాబట్టుకుంది.

అయితే ఓవర్సీస్‌లో అఖండ చిత్రం ఫస్ట్ వీక్ మొత్తంగా 10.08 కోట్ల గ్రాస్‌ని సాధించింది. ఒక్క అమెరికాలోనే 6.68 కోట్ల షేర్ ఉండడం విశేషం. దీంతో “అఖండ” ఓవర్సీస్‌లో 2021లో హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగానే కాకుండా, హైయ్యెస్ట్ గ్రాస్‌ని సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా అఖండ మాస్ జాతర మారు మోగిందనే చెప్పుకోవాలి.

సంబంధిత సమాచారం :