‘అఖండ” సినిమాతో శ్రీకాంత్ దశ తిరిగినట్టేనా..!

Published on Dec 3, 2021 2:32 am IST


నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌ని తెచ్చుకుంది. ఈ సినిమాలో రైతుగా, అఘోరాగా రెండు పాత్రల్లో నటించిన బాలకృష్ణ అదరగొట్టేశాడని అంతా అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడిగా వరదరాజులు పాత్రలో శ్రీకాంత్ నటించిన తీరుపై కూడా సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే సుదీర్ఘకాలం పాటు ఫ్యామిలీ హీరోగా కొనసాగిన శ్రీకాంత్ విలన్‌గా ఎలా మెప్పిస్తాడా అని అంతా అనుకున్నారు. కానీ తెరపై శ్రీకాంత్ తన పాత్రకి వంద శాతం న్యాయం చేశాడని సినిమా చూశాక అనుకున్నారు. గతంలో బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన లెజెండ్ సినిమా ద్వారా విలన్‌గా పరిచయమైన జగపతిబాబుకు ఆ సినిమాతో ఆయన దశ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం జగపతిబాబు స్టార్ విలన్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు అఖండ సినిమాతో శ్రీకాంత్ దశ కూడా తిరిగిపోవడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :