“అఖండ” ఓటీటీలోకి వచ్చేది అప్పటినుంచేనా?

Published on Dec 9, 2021 2:40 am IST


నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకుని వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక రికార్డులను వసూల్ చేస్తూ థియేటర్లో మాస్ జాతర చూపిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి అడుగుపెట్టనుందట.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటిటి దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసిన ఈ చిత్రాన్ని జనవరి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‌ని ప్రకటించనున్నారట. థియేటర్లలో పూనకాలు తెప్పించిన ఈ సినిమా ఓటీటీలో ఏం చేస్తుందో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :