ఓవర్సీస్ లో అఖండ దూకుడు… వన్ మిలియన్ వైపు దూసుకు పోతుంది గా!

Published on Dec 6, 2021 10:38 am IST

బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబో లో వచ్చిన అఖండ చిత్ర బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. భారీ వసూళ్ల తో సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం మాత్రమే కాకుండా, బోయపాటి శ్రీను బాలకృష్ణ అంటేనే ఒక చరిత్ర అనే విధంగా సినిమా సమాధానం చెబుతోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, ఓవర్సీస్ లో కూడా తన సత్తా చాటుతోంది. ఈ ఏడాది భారీ వసూళ్లను రాబట్టిన చిత్రాల్లో అఖండ టాప్ ప్లేస్ కి దూసుకు పోయేలా ఉంది.

ఇప్పటి వరకు ఓవర్సీస్ లో అఖండ చిత్రం 800కే డాలర్స్ కి పైగా వసూళ్లను రాబట్టింది. వీకెండ్ లో భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం సోమవారం నుండి ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఈ చిత్రం డీసెంట్ గా ఫిల్ అయినా, చాలా ఈజీ గా వన్ మిలియన్ డాలర్ల ను రాబడుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. బోయపాటి శ్రీను దర్శకత్వం, థమన్ సంగీతం, బాలయ్య నట విశ్వ రూపం తో సినిమా మరొక లెవెల్ లోకి ఎలివేట్ అయ్యింది అని చెప్పాలి. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో నటించడం జరిగింది.

సంబంధిత సమాచారం :